“మీకు రాజారాం మోహన్ రాయ్ తెలుసా..”
” మరి..’రెట్టమలై శ్రీనివాసన్ ‘ తెలుసా..తమిళనాడు..పక్క రాష్ట్రమే..”
ఆయన గాంధీ కి తమిళ సంతకం నేర్పిన వాడు…అంబేద్కర్ తో పాటు లండన్ లో రెండు రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లకు హాజరైన దళిత మేధావి..
” రెట్టమలై శ్రీనివాసన్.”.1859 లో కాంచీపురం లోని నిరుపేద ‘పరయా’ దళిత కుటుంబం లో జన్మించారు.మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఆయోతి దాస్ అనే బంధువు సహకారం తో డిగ్రీ చదివారు..
నీలగిరి పర్వతాల్లో అకౌంటెంట్ గా పనిచేశారు..దళితుల పట్ల వివక్షను అప్పుడే అర్ధం చేసుకున్నారు.’పరయార్ మహాజన సభ ‘ అనే సంఘాన్ని స్థాపించారు..
. 1893 లో కాంగ్రెస్ పార్టీ ICS పరీక్షలు భారత దేశంలో నే జరపాలని డిమాండ్ చేయగా.ఇక్కడ జరిపితే కేవలం బ్రాహ్మలు..అగ్రకులాల వారికే అవకాశం లభిస్తుందని 3412 అభ్యర్థులతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
1898 లో గవర్నర్ సర్ జార్జ్ చెస్నీ ని కలిసి పాఠశాలల్లో దళిత పిల్లలకు ప్రవేశం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.చెన్నై మునిసిపల్ పాఠశాలల్లో దళిత విద్యార్థుల ను చేర్పించడం కోసం పెద్ద యుద్ధమే చేశారు..
‘పరయన్’ అనే పత్రికను స్థాపించారు.దళితుల లో ఆత్మన్యూనత పోవాలంటే చదువే మార్గమని రోజూ పత్రికలో అనేక కొటేషన్స్ రాసేవారు.
నాలుగు అణాల ఆ పత్రిక పై విషప్రచారం చేసిన అగ్రకులాల వారు…పరయన్ పత్రిక ఆంగ్లేయుల కు వ్యతిరేకంగా ఉందన్న అభిప్రాయం కలిగించి ..వారిచేతే పత్రికను మూసేయించారు.
శ్రీనివాసన్ తరువాత బారిస్ట్రీ అభ్యాసం కోసం ఆఫ్రికా కు వెళ్ళారు.. అక్కడ గాంధీజీ ని కలిసారు.
గాంధీ ..శ్రీనివాసన్ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు.శ్రీనివాసన్ గాంధీ కి తమిళం లో సంతకం పెట్టడం నేర్పారు.దళితుల పట్ల భారతదేశం లో ఉన్న వివక్షను అనేక సందర్భాల్లో ,చర్చల్లో ప్రస్తావించేవారు.అనేక మార్లు గాంధీ తో విభేదించేవారు.
గాంధీ.. మరియు శ్రీనివాసన్ బృందం ఒకసారి ” Windsor Castle” లో బ్రిటిష్ రాజు “జార్జ్- v” ని కలవడానికి వెళ్లారు..శ్రీనివాసన్ కావాలని తాను అంటరానివాడిని (I am Untouchable )అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు.బ్రిటిష్ రాజు ఈ చర్యకు నివ్వెరపోయాడు.’మా భారతదేశం లో దుస్థితి ఇది ‘అని ఆ సంఘటన తో ప్రపంచ దృష్టికి కులవివక్ష ను తీసుకెళ్లారు.
తిరిగి భారతదేశం వచ్చారు.అంబేద్కర్ తో కలిసి మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.1921 లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికయ్యారు.
.చెన్నైలోని వీధులలో..మార్కెట్లలో..బావులలో.. ఎవరైనా దళితులకు ప్రవేశం నిరాకరిస్తే 100 రూపాయల జరిమానా విధించేలా చట్టం తెచ్చారు.ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు ఉండాలని పోరాడారు.
స్వాతంత్ర్యానంతరం తమిళనాడు ప్రభుత్వం వారిని అనేక బిరుదులతో సత్కరించింది.కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విదుదల చేసింది.ముఖ్యమంత్రి జయలలిత వారిపేరిట శ్రీనివాసన్ మెమోరియల్ భవన్ నిర్మించారు..
రెట్టమలై శ్రీనివాసన్ పోరాట స్ఫూర్తి ..ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శం.
Written By,
Smt. Rajitha Kommu
Principal, Govt.Junior College,Peddemu.Ranga Reddy