నిన్న శ్రీనివాస రామానుజన్ జయంతి ని ” మాథ్స్ డే ” గా జరుపుకున్నాం కదా..ఈ రోజు మీకు 90 రూపాయల జీతం తో లెక్కల మాస్టారు గా పనిచేసి…తర్వాత 38 ఏళ్ళ పిన్న వయసులో రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన దళిత మహా మనిషి గురించి వివరిస్తాను.
అవును..వారే..తెలుగు వారే..హైదరాబాద్ లో ట్యాంకుబండ్ మీదుగా వెళ్తుంటే రెపరేపలాడే ఎత్తైన జెండా …సంజీవయ్య పార్క్ లో ఉంది..పార్కులు స్మృతివనాల కన్నా గొప్పవారి చరిత్రలు ప్రాచుర్యం లోకి తేవడం అవసరం.
దామోదరం సంజీవయ్య 1921 లో మద్రాస్ ప్రెసిడెన్సీ ..కర్నూల్ లోని పెద్దపాడు గ్రామంలో జన్మించారు..అత్యంత నిరుపేద కుటుంబం.సంజీవయ్య పుట్టిన మూడు రోజుల కె వారి తండ్రి చనిపోయారు.తల్లి సుంకులమ్మ అతి కష్టంగా వారిని పెంచింది.కర్నూల్ లోని అమెరికన్ బాప్టిస్ట్ స్కూల్ లో చదివేవారు.పశువులు కాయడం..నేత పనిలో కూలీకి వెళ్లడం చేస్తూనే చదువుకునే వాడు.SSLC లో జిల్లా కే ప్రథముడిగా నిలిచాడు.
స్నేహితుల బంధువుల ప్రోత్సాహం తో ప్రభుత్వ సీడెడ్ కాలేజ్ లో జియోగ్రఫీ ..లెక్కలు చదివారు.
చిన్న చిన్న ఉద్యోగాలు చేసి..పచ్చయ్యప్ప స్కూల్ లో లెక్కల మాష్టారిగా పనిచేశారు.వారికి ఆంగ్లం పై మంచి పట్టు ఉండేది.అనర్గళంగా మాట్లాడేవారు.
నాటకాలంటే మక్కువ.కొన్ని నాటకాలు రాసి..పిల్లలతో వేయించేవారు.1950 లో ‘లా’ చదివారు.
అనతికాలంలోనే లొనే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు.వారి వాక్చాతుర్యం తో తొందరగానే మంచి నాయకుడిగా ఎదిగారు.
AICC అధ్యక్షుడి గా ఎన్నికైన మొట్టమొదటి దళితుడి గా పేరుగాంచారు.
అనూహ్య పరిస్థితుల్లో 1960 లో ముఖ్యమంత్రి అయ్యారు..నీలం సంజీవరెడ్డి కి ఇతర నాయకుల మధ్య జరిగిన ఆధిపత్య గొడవలు..కుర్చీల కోసం కుమ్ములాటలు చూడలేని సంజీవయ్య 1962 లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తెల్లవారే భార్యను తీసుకుని నడుచుకుంటూ సినిమాకు వెళ్లిన నిగర్వి.సేవకు పదవి కి సంబంధం లేదని దళితుల..పేదల చదువుకు ఎంతో తోడ్పాటుని అందించారు.
అంతటి సమర్ధుడైన నాయకున్ని హై కమాండ్ వదులుకోలేక వారికి కాబినెట్ మంత్రి పదవి ఇచ్చింది.’ కేంద్ర ‘కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా నియమింపబడ్డారు..కార్మిక శాఖ మంత్రి గా అనేక చట్టాలకు రూపకల్పన చేశారు.సంజీవయ్య రాసిన
“Labour problems and Industrial Development ” పుస్తకాన్ని oxford university press ముద్రించింది.
1972 లో రోడ్డు ప్రమాదానికి గురై గుండె పోటు తో మరణించారు.కేంద్ర ప్రభుత్వం వారి గౌరవార్థం పోస్టల్ స్టాంప్ ముద్రించింది.
హైదరాబాద్ లో వారి పేరిట పార్కు ఉంది..అలాగే విశాఖపట్నం లో సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
వారి సేవలు..ఆశయాలు ఆదర్శవంతం.
Written By,
Smt. Rajitha Kommu,
Principal, Govt.Junior College,Peddemu.Ranga Reddy