వీళ్ళు లెనిన్ విగ్రహాన్ని, వాళ్ళు బుద్ధ విగ్రహాన్నీ కూలగొట్టారని, చాలా మంది మిత్రులు బీజేపీ వాళ్ళని తాలిబన్లతో పోలుస్తున్నారు.
ఇక్కడో చిన్న తేడా ఉంది.
అదేమంటే – తాలిబన్లకు ఓట్లేసీ ఎవరూ అధికారం కట్టబెట్టలేదు. కాబట్టి ఇలాంటి వెదవలకి ఎలా అధికారం కట్టబెట్టారని ఎవరినీ నిందించడానికి/ప్రశ్నించడానికీ ఆస్కారం లేదు.
కానీ, అందుబాటులో ఉన్న అన్నిపార్టీల్లోకెల్లా అత్యంత అరాచక పార్టీ అని క్లియర్ గా తెలుస్తున్నా, వీల్లకి ఓట్లేసి ఎలా ఎన్నుకున్నారని రాబోయే తరాలు తప్పక ప్రశ్నిస్తాయి.
ప్రస్తుత జర్మన్ లది అదేపరిస్థితి. ఎప్పుడు చరిత్ర గురించిన ఏ టాపిక్ డిస్కషన్ కి వచ్చినా, జర్మన్లు అక్కడి నుండీ సైలెంట్ గా లేచివెల్లిపోవడమో, లేక ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడమో చేస్తారు. ఎందుకంటే, “హిట్లర్ లాంటి కౄరున్ని మీ పూర్వీకులు ఎలా ఓట్లేసి గెలిపించారుి “? అనే ప్రశ్నకు సిగ్గుతో తల దించుకోవడం తప్ప, వారిదగ్గర సమాధానం లేదు కాబట్టి.
“History repeats itself, first as tragedy, second as farce”. – Karl Marx