Indian Taliban!!!

వీళ్ళు లెనిన్ విగ్రహాన్ని, వాళ్ళు బుద్ధ విగ్రహాన్నీ కూలగొట్టారని, చాలా మంది మిత్రులు బీజేపీ వాళ్ళని తాలిబన్లతో పోలుస్తున్నారు.

ఇక్కడో చిన్న తేడా ఉంది.

అదేమంటే – తాలిబన్లకు ఓట్లేసీ ఎవరూ అధికారం కట్టబెట్టలేదు. కాబట్టి ఇలాంటి వెదవలకి ఎలా అధికారం కట్టబెట్టారని ఎవరినీ నిందించడానికి/ప్రశ్నించడానికీ ఆస్కారం లేదు.

కానీ, అందుబాటులో ఉన్న అన్నిపార్టీల్లోకెల్లా అత్యంత అరాచక పార్టీ అని క్లియర్ గా తెలుస్తున్నా, వీల్లకి ఓట్లేసి ఎలా ఎన్నుకున్నారని రాబోయే తరాలు తప్పక ప్రశ్నిస్తాయి.

Continue reading “Indian Taliban!!!”

కౌసర్ బీ తరుపున, హ్యాపీ ఉమన్స్ డే!!

కౌసర్ బీ తరుపున, హ్యాపీ ఉమన్స్ డే!!
============================
కౌసర్ బీ- ఓ సాధారణ మహిళ,భర్తతోపాటు హైదరాబాద్ విహార యాత్రకు వచ్చి ఇంటికి వెల్తుంటే, గుజరాత్ పోలీసోల్లు బస్ లోనుండీ ఎత్తుకెల్లి,రేప్ చేసి(Yet to be proved in court. But, its proved that she was kept for 3 days, in the form house of a leader, after the death of shohrabuddin ) చంపేశారు. ఆమె డెడ్ బాడీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. పోలీసులంటే హోం గార్డులో, బీటు కానిస్టేబుల్లో కాదు. గుజరాత్ లో అత్యున్నత స్థాయి ఐ.పి.యస్ ఆఫీసర్లు.

ఆమెనే ఎందుకు?
ఆమె భర్త షోహ్రాబుద్దీన్. రౌడీ,ఎక్స్టార్షనిస్ట్. అంటే, జనాల్ని చంపుతానని బెదిరించి డబ్బులు వసులు చేసేవాడు. గుజరాత్ పోలీసులు ఇతన్ని బస్సులో నుండీ ఎత్తుకెల్లి చంపేసి, మోడీని చంపడానికి వెల్తున్నప్పుడు, తాము అడ్డగించి, సినిమా హీరోల్లా చంపేశామని పేపర్లకు ఫోజులిచ్చారు. అనంతరం మోడీతో ఫోటోలు దిగి, ప్రమోషన్లు పట్టారు.

Continue reading “కౌసర్ బీ తరుపున, హ్యాపీ ఉమన్స్ డే!!”

చంద్రబాబూ.. ఐ యామ్ విత్ యు!!

చంద్రబాబూ.. ఐ యామ్ విత్ యు!!
=========================

“ఓ సిట్టింగ్ సీబీఐ జడ్జి, మరో ఇద్దరు జడ్జిలు అణుమానాస్పదంగా చనిపోతే అడిగే దిక్కులేదు.”

“ఎన్నికల్లో 20 MLA స్థానలు గెలిచిన పార్టీని పక్కన పెట్టి, 2 MLAలున్న పార్టీని గవర్నరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తాడు. చివరికి ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ”

“ఢిల్లీ ఆప్ MLAల్లో దాదాపు ముప్పావు వంతు వారిపై ఏదో ఓ అడ్డమైన కేసులు, పోలీసులు ఆఘమేఘాల మీద వారిని అరెస్టు కూడా చేసి కోర్టుకు తీసుకెల్లడం, అక్కడ కోర్టు, ఏ మాత్రం ఆధారాల్లేకుండా ఎందుకు అరెస్టు చేశారని పోలీసుల్ని తిట్టడం.”

“తమిల్ నాడు రాష్ట్ర పోలీసులకు, కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా, ఆ రాష్ట్ర Chief SecreTary(CS) పై, అర్థరాత్రి సీబీఐ దాడులు, అరెస్టులు”

” ప్రధాన మంత్రి నాలుగేళ్ళలో, కనీసం, ఒక్కటంటే, ఒక్కటైనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడం.”

“పార్లమెంట్ సాక్షిగా, ప్రధాన మంత్రీ, ఇతర మంత్రులూ, నోటికొచ్చిన అడ్డమైన అబద్ధాలూ మాట్లాడటం.”

చెప్పుకుంటూపోతే, ఈ లిస్టు చాంతాడంత ఉంది. ఇవన్నీ ఓ నాలుగేళ్ళ ముందు వరకూ , కనీసం ఊహకు కూడా అందని విషయాలు. కానీ ఇప్పుడు మాత్రం నిలువెత్తు నిజాలు.

ఎందువల్ల..?

Continue reading “చంద్రబాబూ.. ఐ యామ్ విత్ యు!!”

అధ్వానీ!!

అధ్వానీ!!
==========

పైన టైటిల్ లో ఒత్తు తప్పేం లేదు. 90 ఏళ్ళ ముసలోడు అద్వానీ చేతులు జోడించి దండం పెడుతుంటే, మోడీ చూసీ,చూడనట్లు, ఓ పురుగును చూసినట్లు, ఏ మాత్రం పట్టించుకోకుండా, రొమ్మువిరుచుకుని ముందునుండీ అలా నడుచుకుంటూ వెళ్ళి, ఆ పక్కనే ఉన్నాయనకి మాత్రం కరచాలనం చేశాడు.రాజకీయాల్లో గెలుపోటములు, ఎత్తుపల్లాలు సహజం. కానీ, ఇంత అధ్వాన పరిస్థితి అద్వానీకి తప్ప మరెవరికీ వచ్చి ఉండదు. ఇది చూసి ఒక్క క్షణం పాటు, అద్వానీ మీద జాలి కలిగింది. కేవలం ఒక్క క్షణమే, ఆ వెంటనే భారతదేశ రాజకీయాలు ప్రస్తుతం ఇలా ఉండటంలో ఆయన పాత్ర గుర్తొచ్చి -Karma is a BITCH కి ఇంతకంటే నిదర్శనం మరోటి ఉండదనిపించింది.

Continue reading “అధ్వానీ!!”