బహుభార్యత్వం-రాజకీయం

మీకు జిమ్మీ స్వగార్ట్ తెలుసా? ఈయన చా…లా గొప్ప అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు. ఎంత గొప్ప అంటే, అమెరికన్ ప్రెసిడెంట్లే ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసేంత. ఈయనకు అమెరికాలో సొంత టీవీ నెట్వర్క్ ఉండేది. టీవీ సెట్ల ద్వారా ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రసంగాలు మారుమోగిపోతుండేవి. ఇప్పుడు ఈయన్ని కాసేపు పక్కన పెట్టండి.

మీకు షేక్ అహ్మద్ దీదాద్ తెలుసా? ఈయన ఇస్లాం ప్రచారకుడు. గుజరాత్లో పుట్టాడు, చిన్నప్పుడే వీరి కుటుంబం దక్షిణాఫ్రికా కు వలస వెళ్ళింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఈయన, డర్బన్ లో క్రైస్తవ మిషనరీ స్కూల్ కు ఎదురుగా ఉండే ఫర్నీచర్ షాప్ లో పని చేసేవాడు. ఆ మిషనరీ స్కూల్లో “ముస్లింలను క్రైస్తవం వైపుకు ఆకర్షించడం ఎలా” అనే థియరీ చదువుకున్న క్రైస్తవ విద్యార్థులు ఈయనపై ప్రాక్టికల్స్ చేసేవారు. వారి వాదనలతో తన సొంతమతంపై అనుమానాలు కలిగి,అయోమయానికి గురైన అహ్మద్ దీదాద్ ఇస్లాం ని,దాంతోపాటు క్రిస్టియానిటీని లోతుగా చదివాడు. అలా ఇస్లాంపై తన నమ్మకం మరింత కన్సాలిడేట్ అయి, చివరికి ఆ క్రైస్తవ విద్యార్థులపై రివర్స్-ప్రాక్టికల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విద్యార్థులు ఈయన్ని చూసి పారిపోవడం మొదలుపెట్టాక, వారి ప్రొఫెసర్స్ ని “మాట్లాడుకుందాం రా” అని పిలిచేవాడు. అలా ఆఫ్రికా దాటి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖ క్రైస్తవ పాస్టర్లతో డిబేట్లు చేశాడు. వాటిలో గెలిచాడా,లేదా అనేది యూటూబ్ లో ఉన్న ఆ డిబేట్లు చూసి ఎవరికి వారు నిర్ధారించుకోవచ్చు.

“మాట్లాడుకుందాం రా”.. అని అహ్మద్ దీదాద్ పేరున్న క్రైస్తవ ప్రముఖులకూ, చివరికి పోప్ కూ కూడా లేఖలు రాశారు. పోప్ స్పందించలేదు గానీ, జిమ్మీ స్వగార్ట్ మాత్రం సరేనన్నారు. అలా, జిమ్మీ స్వగార్ట్ సొంత పిచ్ మీద, అంటే ఆయన సొంతూరు లూసియానాలో జిమ్మీ స్వగార్ట్ కీ-అహ్మద్ దీదాద్ కీ మధ్య డిబేట్ జరిగింది.
ఎవరేం మాట్లాడనేది యూటూబ్ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఆ డిబేట్ లో, ఇస్లాం ని అటాక్ చేస్తూ- జిమ్మీ స్వగార్ట్ ఓ పాయింట్ చెప్పారు. అది – “మీ మతంలో ఒక మగాడు నలుగుర్ని చేసుకోవచ్చు. అది మహిళలకు అన్యాయం. అదే మా మతంలో ఒక మగాడికి ఒక స్త్రీనే”. దానికి ఆన్సర్ గా నలుగురు భార్యల కాన్స్పెట్ ని కవర్ చేసుకుంటూ అహ్మద్ దీదాద్ గారు తన ఇస్లామిక్ వెర్షన్ ఏదో చెప్పుకున్నారు.

సరే, ఇప్పుడు క్లైమాక్స్- జిమ్మీ స్వగార్ట్ గారి సెలబ్రిటీ హోదా మొత్తం కొన్ని రోజులకు హారతికర్పూరంలా కరిగిపోయింది. ఎందుకు..? ఎందుకంటే, ఆయన కాల్ గర్ల్స్ తో లాడ్జ్ హోటల్లలో పట్టుబడటం వల్ల.

ఈ విషయం గురించి ఇస్లాం ఏమంటదంటే –
“నీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ కుటుంబాల్ని సరిసమానంగా మెయింటేన్ చేసేంత డబ్బు,టైమూ,శక్తీ ఉంటే, పద్దతిగా రెండు పెళ్ళిల్లు, ఇంకా ఎక్కువుంటే మూడు, ఇంకా ఎక్కువుంటే నాలుగు పెళ్ళిల్లు చేసుకో. సరిసమానంగా చూసుకునేంత సీన్ లేకుంటే మాత్రం ఒక్కర్నే చేసుకో” ఇదీ ఇస్లాం చెప్పేది. దీంతో పాటు చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్న పెళ్ళాన్ని తప్ప, పరస్త్రీని కనీసం కళ్ళెత్తి కూడా చూడకుండ, చూపుల్ని కిందికి దించుకోమని ఖురాన్ కరాఖండీగా చెప్తుంది. జిమ్మీ స్వగార్ట్ ముస్లిం అయ్యుంటే,ఆయన దగ్గరున్న డబ్బుకు చక్కగా రెండో,మూడో పెళ్ళిల్లు చేసుకుని సెటిల్ అయిపోయిఉండేవారు తప్ప వేశ్యల దగ్గరికి వెల్లి బర్బాద్ అయ్యేవారు కాదు.

సో, పాయింట్ ఏంటంటే- “ఒకర్నికంటే ఎక్కువమందిని పెళ్ళి చేసుకోవచ్చు”- అనేది ఇస్లాం కొందరు పురుషులకు ఇచ్చిన వెసలుబాటు మాత్రమే. “ఒక మహిళ నలుగురు పురుషుల్ని ఎందుకు చేసుకోకూడదు, ఇది మహిళల్ని తొక్కేయడం కాదా” అని ‘లేత ఫెమినిస్టు’ ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి సమాధానం -” ఇస్లాం ప్రకారం స్త్రీ-పురుషులు సరూపాలేగానీ సర్వ సమానాలు కాదు. వారి,వారి శరీర,మానసిక లక్షణాల్ని బట్టి సృష్టికర్త స్త్రీ-పురుషులకు చేసిన సూచనలు ఇవి. ఈ సూచనల ప్రకారం కుటుంబాలూ, సమాజమూ చక్కగా నడవవొచ్చు, దానికి 1400 ఇస్లామిక్ చరిత్రే సాక్ష్యం. లేదు, ఒక మహిళ నలుగురు పురుషుల్ని చేసుకుని కూడా కుటుంబమూ,సమాజమూ చక్కగా నడుస్తాయని వాదిస్తే, అలాంటి ఊహాజనిత ఆర్గ్యుమెంట్లకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఎవడి పిచ్చివాడికానందం అని వదిలేయడమే.

ఒక భార్యా+ఆమె పిల్లలకు విచ్చల విడిగా ఖర్చుపెట్టాక కూడా తరిగిపోని సంపదా,టైమూ, కోరికా ఉన్న పురుషుడు, మరో మహిళను చట్టప్రకారం పెళ్ళి చేసుకుని ఆమెను+ఆమె పిల్లల్ని కూడా చూసుకునే వ్యవస్థ మంచిదా లేక, ప్రభుత్వమే చట్ట ప్రకారం బ్రోతల్ హౌస్ లకు లైసెన్స్లు లిస్తే, అక్కడి మహిళల దగ్గరికెల్లి కోరిక తీర్చుకునే సిస్టమ్ మంచిదా? స్త్రీ సంక్షేమం పాయింటాఫ్ వ్యూలో- కుటుంబం/సమాజం పాయింటాఫ్ వ్యూలో ఏది మంచిది అనేది కూడా మరో డిస్కషన్.

ఇప్పుడు పాలిటిక్స్ దగ్గరకు రండి-
బహుభార్యత్వాన్ని డిఫెండ్ చేసిన అహ్మద్ దీదాద్ కు, ఈ వ్యాసం రాసిన నాకూ, నాలాంటి మెజారిటీ కోట్లాది ముస్లింలకూ ఒక్కరే భార్య. “సౌదీ లో ఉంటున్న అరబ్ షేక్ లు ఒక్కొక్కరు ఎన్నెన్ని పెళ్ళిల్లు చేసుకుంటారు” అని- సౌదీ లో చాలా ఏళ్ళుగా ఉంటున్న మా కజిన్ ని అడిగితే అతను నవ్వేసి – “మోస్ట్ లీ ఒక్కటే”- అన్నాడు.

అదేంటి – “అక్కడ షరియా ప్రకారం పూర్తిగా అలోవ్డ్ కదా, పైగా వాల్లంతా ధనవంతులే కదా, ఒక్కర్నే ఎందుకు” అంటే –
“అక్కడ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించాలంటే ఆమె కోరినంత మెహర్ ఇవ్వాలి. సహజంగా అమ్మాయిలు కూడా సంపన్న కుటుంబాలవారే కావడంతో వారు అడిగే మెహర్ కూడా భారీగానే ఉంటుంది. దీంతో ఒక్క పెళ్ళి చేసుకోవడానికే అక్కడి యూత్ నానా తంటాలు పడ్తుంటారు”- అని చెప్పాడు. నాకు ప్రత్యక్షంగా తెలిసిన ఓ వంద ముస్లిం కుటుంబాల్లో, మహా అంటే ఓ మూడో,నాలుగో “దూస్రీ షాదీ” సంఘటనలు ఉన్నాయి. ఇంత రేర్ గా జరిగే ఓ అంశం గురించి, దేశంలో ఇంక వేరే సమస్యలేమీ లేవన్నట్లు గంటలు,గంటలు చర్చలు, టీవీ డిబేట్లు.. అంతా సంఘీ మీడియా,సంఘీ ప్రభుత్వ స్కెచ్ ప్రకారమే జరుగుతుంది.

రాజ్యాంగం అనుమతించిన ముస్లింల పోలీగమీ ని ప్రభుత్వం నిషేధించినా, దానితో ముస్లిం సమాజానికి పెద్దగా నష్టమేమీ ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టులు కూడా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తీర్పులు చెప్పేంత సీన్ ఉందనుకోవడం భ్రమ. కోట్లాది ప్రజల పౌరస్వతాన్ని రద్దు చేసే చట్టాలనే ప్రశ్నించే దిక్కులేదు. పైగా పౌరస్వతం కోసం చేసిన షహీన్ బాగ్ ఉద్యమాన్నే నెగెటివ్ గా చిత్రించి, ఉద్యమకారులపై దారుణమైన,హాస్యాస్పదమైన కేసులు బనాయించి జైల్లలో వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, పోలీగమి రద్దుకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అంత అవసరం కూడా లేదు.

సృష్టికర్త ఆప్షనల్ గా చేసిన సూచనలు స్వతంత్ర్య మానవుడు తన ఫ్రీ విల్ ఆధారంగా ఎంచుకోవలసినవి/ఆచరించవలసినవే తప్ప, పోలీసులు,కోర్టులు,ప్రభుత్వం నీ చుట్టూ నిలబడి తుపాకులతో బెదిరిస్తున్నప్పుడు, నీకు ఆప్షన్సే లేకుండా చేసినప్పుడూ ఫాలో అవ్వాల్సినవి కావు.

తనకు ఓట్లేసిన మెజారిటీ హిందువుల మేలు కోసం చేసిన మంచిపని ఒక్కటీ లేకపోవడంతో, “ముస్లింలను సతాయించడమే హిందువులని ఉద్దరించడం” అనే అప్రకటిత విధానాన్ని ప్రభుత్వం ఫాలో అవుతున విషయం మాత్రం సుస్పష్టం. ట్రిపుల్ తలాక్,హిజాబ్ బ్యాన్,ఇప్పుడీ మ్యారేజ్ యాక్ట్ – ఇవన్నీ దానిలో భాగమే.

క్యూరియస్ కేస్ ఆఫ్ జిమ్మీ స్వగర్ట్:

“మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు” అని ఓ సామెత.
క్రైస్తవం గురించి అంత గొప్ప ప్రసంగాలు చేసిన జిమ్మీ స్వగర్ట్(J.S) అలాంటి పని చేయడమేంటా అనే ఆలోచన కంటే, J.S గురించి నేను రాయడమే ఎక్కువగా గుచ్చుకున్నట్లుంది కొందరు మిత్రులకు. సరే, అది హ్యూమన్ నేచర్ కాబట్టి లైట్ తీసుకుందాం. అసలు ఇస్లామిక్ పోలీగమీ డిస్కషన్ లో జిమ్మీ స్వగర్ట్ ను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనేది వ్యాలిడ్ ప్రశ్నే. దానికి సమాధానం ఇది-
జిమ్మీ స్వగర్ట్ -షేక్ అహ్మద్ దీదాద్ ల మధ్య డిబేట్ 1986లో జరిగింది. ఆ డిబేట్లో, ఇస్లాం బహుభార్యత్వానికి అనుమతించిన విషయాన్ని ఎద్దేవా చేస్తూ జిమ్మీ స్వగర్ట్ కొన్ని కామెంట్లు చేశారు.
1987లో జిమ్మీ స్వగర్ట్ వ్యభిచారం చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి.(ఇద్దరు క్రైస్తవ మతప్రచారకుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు కారణంగా ఇవన్నీ బయటికి వచ్చాయి. ముందుగా, జిమ్మీ స్వగర్ట్ తన ప్రత్యర్థికి-చర్చ్ సెక్రటరీకి ఉన్న అక్రమ సంభంధాన్ని బయటపెట్టి ఆయన్ని చర్చ్ నుండీ బయటికి గెంటేయించాడు. దానికి ప్రతీకారంగా, ఆ ప్రత్యర్థి ప్రైవేట్ డిటెక్టివ్ లను పెట్టి జిమ్మీ స్వగార్ట్ వ్యభిచారానికి సంబంధించిన ఫోటోల్ని తీయించాడు).
Debra Murphree అనే ఒక ప్రోస్టిట్యూట్ మహిళ, J.S తన దగ్గరకు సుమారు 20-25 సార్లు వచ్చాడనీ, నెలకు 2-3 సార్లు వస్తుంటాడనీ చెప్పింది. ఆ వీడియో ఇంటర్వ్యూలు ఇంకా యూటూబ్ లో ఉన్నాయి. 1988 ఫిబ్రవరి లో, తాను తప్పు చేశాననీ, క్షమించమనీ బహిరంగంగా J.S ఒప్పుకున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే- ఓ వైపు ఇతర మహిళల్తో ఇల్లీగల్ సంబంధాలు నెరుపుతూనే,అంతమంది ముందు స్టేజ్ మీద నిలబడి- “మా మతంలో కేవలం ఒక్కరే” అని ఎలా చెప్పగలిగాడు. ఎలాగోలా ప్రత్యర్థిని డిబేట్ లో ఇరుకున పెట్టాలనే తపన తప్ప, నేనే స్వయంగా ఉల్లంఘిస్తున్న ఈ ఒక్క పాయింట్ని ప్రస్తావించకపోవడమే మంచిదనే ఆత్మ ప్రబోధం ఆయనకు కలగలేదా?
*******
ఆయనకే కాదు, ప్రస్తుతం సోషల్ మీడియాల్లో జరుగుతున్న డిబేట్లు, కౌంటర్-రివర్స్ కౌంటర్లు కూడా దాదాపు ఇలాంటివే. ఆ పోస్టు కింద ఓ మాట, మరో పోస్టు కింద మరో మాట. అక్కడో లాజిక్-ఇక్కడో లాజిక్. మేల్-ఫిమేల్ సెక్సువాలిటీ గురించి, సెక్యువల్ టెండెన్సీస్ గురించి కొన్నిసార్లు ఎక్స్పర్ట్ ఒపీనియన్లు చెప్పడం, మరోసారి మాత్రం “అంతా సమానమే కదా” అని అమాయకంగా ప్రశ్నించడం. ఓ సారి నీతి నియమాలు లేక సమాజం ఏమైపోతుందో చూశారా అని ఆవేశంగా ప్రశ్నించడం, మరోసారి, నీతి నియమాలు దేవుడు మాత్రమే చెప్పాలా, మేమ్ డిసైడ్ చేసుకోలేమా అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించడం..ఓ సారి “మీ మత గ్రంధంలో ఇలా ఉంది, మాది మాత్రం చాలా ప్యూర్” అని స్టేట్మెంట్లిచ్చేయడం. తీరా వారి మత గ్రంధాల నుండే కొన్ని వాక్యాల్ని చూపించి, ‘మరి ఇవేమిటి’- అని అడిగితే -“అబ్బే, మా మత గ్రంధాల్ని మేం అస్సలు పాటించం” అని ఎస్కేపవడం. ******
Introspection, తెలుగులో చెప్పాలంటే -“ఆత్మపరిశీలన” అని ఒకటుంది. అంటే మన సొంత ఆలోచనలపై అవగాహన, క్లారిటీ కలిగిఉండటం. అదేగనక ఉంటే, చాలా విషయాలు డిబేట్లు లేకుండానే అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published.