మీకు జిమ్మీ స్వగార్ట్ తెలుసా? ఈయన చా…లా గొప్ప అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు. ఎంత గొప్ప అంటే, అమెరికన్ ప్రెసిడెంట్లే ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసేంత. ఈయనకు అమెరికాలో సొంత టీవీ నెట్వర్క్ ఉండేది. టీవీ సెట్ల ద్వారా ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రసంగాలు మారుమోగిపోతుండేవి. ఇప్పుడు ఈయన్ని కాసేపు పక్కన పెట్టండి.
Continue reading “బహుభార్యత్వం-రాజకీయం”Interesting Author: Wael Hallaq
“టాప్ 500 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ముస్లింస్ ఇన్ వరల్డ్” – అని ఓ లిస్ట్ ఉంది. దాన్లో ఉన్నోల్లలో నాకు తెలిసిన వారు ఎవరెవరున్నారా అని స్క్రోల్ చేస్తూ ఉంటే – ఒక పేరు మాత్రం వెరైటీగా అనిపించింది. ఆ పేరు -Wael Hallaq.
ఇతని గురించి ఎప్పుడూ వినలేదు, ఎవరై ఉంటారా అని ఫర్దర్ సెర్చ్ చేస్తే, ఇతని గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉందని అర్థమైంది.అసలు ఆ లిస్ట్లో ఈయన పేరు ఎందుకు చేర్చారనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలేఉంది. ఎందుకంటే, ఇతను క్రైస్తవుడు. ఇస్లాం లోకి కన్వర్ట్ అవ్వలేదు. పుట్టింది పాలస్తీనాలోని నజ్రత్ అనే ప్రాంతంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉంది.
Continue reading “Interesting Author: Wael Hallaq”ఒకటో క్లాసు ప్రశ్న- జ్వరం వస్తే యాడికెల్తావ్..?
జ్వరం వస్తే హాస్పిటల్ కి వెళ్తారు గానీ, గుడికో/మసీదుకో/చర్చ్ కో కాదు కదా అనేది – “నాస్తిక-ఆస్తిక” చర్చల్లో ఎలిమెంటరీ స్థాయి కొచెన్.
స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్ లా, అప్పుడప్పుడే ఈ చర్చల్లోకి వచ్చిన లేలేత నాస్తికులు, ఇదో భీబత్సమైన లాజికల్ కొచెన్ అనేంత ఎక్సైట్మెంట్ తో ఈ ప్రశ్న అడుగుతుంటారు.
ముస్లింల పూర్వీకులు ఎవరు..? ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు గానీ..
ఇంట్లో ఉన్న పూరీ నచ్చదుగానీ,ఆ చపాతీ ముఖంది కావాలంట- అని అప్పట్లో త్రిష చెప్పింది. మనం మార్చి చెప్పుకుందాం.
మన కళ్ళముందే – సెలబ్రిటీ స్టేటస్, మిలియన్ల డాలర్ల కొద్దీ సంపద, ఫారెన్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు.. ఇవన్నీ ఉండి కూడా, “సంథింగ్ మిస్సింగ్” అనుకుంటూ, ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతున్న వారిగురించి రాస్తే అవి నచ్చవు..పైగా, “మత ప్రచారం చేస్తున్నారు బాబోయ్”.. అని గావుకేకలు.
Charles le Gai Eaton(1920-2010)రచనల ప్రభావం
ఈయన 1920లో స్విట్జర్ల్యాండ్ లో జన్మించాడు. ఇతని కుటుంబం చిన్నప్పుడే బ్రిటన్ కి వలస వెళ్ళింది. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. మొదట టీచర్ గా, తర్వాత బ్రిటీష్ ప్రభుత్వ రాయబారిగా, ఈజిప్ట్,ఇండియా,ట్రినిడాడ్ లలో పని చేశారు.
యువకుడిగా ఉన్నప్పుడు what is the purpose of life అనే అనుమానం, వివిధ మతాల్ని స్టడీ చేయడానికి, చివరికి 1951లో ఇస్లాం స్వీకరించడానికీ కారణమైంది.
ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్
ఇటీవల ఉర్లోని ఓ ఫ్రెండ్ కి కాల్ చేశాను. మాటల మధ్యలో,దేశ రాజకీయాల గురించి చర్చ వచ్చింది. “తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయిగానీ, చెడ్డీగాల్లు బ్యాక్గ్రౌండ్ లో ఏమేం స్కెచ్చు లేస్తున్నారో తెలీదు, వారికొచ్చే ఫండ్స్, వారి ప్రాబల్యం క్రమంగా పెరిగిపోతున్నట్లు మాత్రం క్లియర్ గానే కనిపిస్తుంది” – అన్నాడు. మరో కామెంట్ కూడా చేశాడు. అది – “మనోళ్ళు కూడా ఏమీ తగ్గట్లేదు. పొద్దున 4 గంటలనుండీ మొదలు పెడ్తారు, ప్రతి ఐదు-పది నిమిషాలకీ, “రోజ్ దారో ఉఠో.. సహర్ కరో.. వక్థ్ హోజారా…” – అంటూ, లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నారు. చుట్టూ ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు.అసలే వేసవి కాలం, పైన డాబాలమీద పడుకుంటుంటారు, వారికి డిస్టర్బెన్స్ ఎందుకు అనే ఆలోచనలేమీ లేవు. వీళ్ళు చేసే ఇలాంటి పనులే, చెడ్డీ గాల్లు వారి మీటింగ్ లలో హైలెట్ చేస్తుంటారు.. ఈ విషయం మనోళ్ళకు ఎప్పటికి అర్థం కావాలో ఏమో” -అన్నాడు.
Continue reading “ఇస్లామిక్ సెన్స్- కామన్ సెన్స్”తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్
ఒకుయేవా నతాలియా – 1983లో చెచెన్యాలో జన్మించింది. 15 యేళ్ళ వయసులో ఫ్యాషన్ రంగంలో మోడల్ గా అడుగుపెట్టింది. 1999లో రష్యా-చెచెన్యా యుద్ధంలో తన సొంత దేశం చెచెన్యాను రష్యా నుండీ కాపాడుకోవడానికి మిలిటరీ లో జాయిన్ అయింది. సైన్యంలో తన తోటి సైనికుడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఇస్లాం లోకి మారి అమీనా ఒకుయేవా గా పేరు మార్చుకుంది.
Continue reading “తుపాకీ పట్టిన హిజాబీ డాక్టర్”స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్
“నీ స్టేషన్ కి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ననుకున్నావా” – అని పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది.కొత్త కానిస్టేబుల్ ఏదేదో చేసేయాలనే తాపత్రయంలో,ఎమోషన్లో ఉంటాడు. కానీ, ఓ ముదురు సీఐ చేతిలో బలైపోతాడు. ఫేస్ బుక్కులో, హిజాబ్ ప్రయోజనాల్ని వివరించే కొందరు ముస్లిం పురుషుల్ని చూస్తుంటే- నాకు ఆ కొత్త కానిస్టేబులే గుర్తొస్తుంటాడు. ఇస్లాం ను పాజిటివ్ గా చూపించాలనే ఎమోషన్లో వీరు చేసే ఇల్లాజికల్ వాదనల్నే, నాస్తికులు,హేతువాదులు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంటారు.
Continue reading “స్టేషన్ కొచ్చిన కొత్త కానిస్టేబుల్”‘షేర్’ లెవ్వరు.. ‘వీర్’ లెవ్వరు..?
భారత ఉపఖండానికి వైశ్రాయ్ గా ఉన్నవారిలో, హత్య చేయబడ్డ ఏకైక వైశ్రాయ్ ఎవరు?
దీనికి సమాధానం – లార్డ్ మయో. ఇది సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఇంపార్టెంట్ బిట్- అని కోచింగ్ సెంటర్లలో చెప్తుంటారు.ఎవరు చంపారు, ఎందుకు చంపారు వంటి వివరాలలోకి మాత్రం ఎవరూ వెల్లరు. ఒకవేళ ఎవరైనా డౌట్ అడిగినా, ఏవో వ్యక్తిగత కారణాలతో ఎవరో చంపేశారులెమ్మని దానిని దాటవేస్తారు.
గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్!!!
ఇది అందరూ వినే ఉంటారు.. .. గాంధీ స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఎగ్జాం రాస్తున్నప్పుడు.. డీఈవో ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు – స్కూల్ టీచర్ గాంధీని పక్కోడి పేపర్లో కాపీ కొట్టమని చెప్తే – గాంధీ కాపీ కొట్టకుండా, నాకు రాదని చెబితే – డీఈవో మెచ్చుకున్నాడనీ.. అంచేత, పిల్లలెవరూ పక్కోల్ల పేపర్లలో కాపీ కొట్టకూడదనీ… అలా మొదటిసారి గాంధీ గురించి విన్నట్లు గుర్తు. ఆ తర్వాత , మా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రతీ ఆగస్టు 15, జనవరి 26 స్కూల్ ఫంక్షన్లలో, ఓ పక్క ఫక్షన్ తర్వాత పంచబోయే చాక్లెట్లను తలచుకుంటూనే, మరో పక్క వృద్ధ టీచర్లందరూ తన్మయత్వంతో గాంధీ,నెహ్రూ వంటీవారి స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్తుంటే – ఆసక్తిగా వినడం – ప్రతీ సంవత్సరం జరిగిన రొటీన్ తంతు. ఆ రకంగా – గాంధీ,నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,,భగత్ సింగ్, సరోజినీనాయుడు,మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,టంగుటూరి ప్రకాశం పంతులు,చంద్రశేకర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు.. వీల్లల్లో ఎవరేం చేశారో ఎగ్జాక్ట్ గా తెలీకున్నా.. వీరందరూ మన తరుపున బ్రిటీషోల్లతో పోరాడి స్వాతంత్ర్యం సాధించారనీ, వీల్లందర్లోకి గాంధీ హీరోచితంగా పోరాడారు కాబట్టి ఆయన జాతిపిత అయ్యారనీ – నా పాఠశాల చదువు నాకు నేర్పించింది.
Continue reading “గాంధీ – అంబేద్కర్ – కాంగ్రెస్!!!”